మహిళాను ‘బాదిన’ బీజేపీ నేత

by CNN TELUGU
0 comment

న్యూఢిల్లీ : పార్టీ కార్యాలయం ఎదుటే బీజేపీ నేత ఒకరు మాజీ మహిళా మేయర్‌పై చేయి చేసుకున్నారు. బీజేపీ మెహ్రౌలీ అధ్యక్షుడు ఆజాద్‌ సింగ్‌ దక్షిణ ఢిల్లీ మాజీ మేయర్‌, తన భార్య అయిన సరితా చౌదరిపై చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పార్టీ సీనియర్‌ నాయకులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఆజాద్‌ సింగ్‌, అతని భార్య కూడా హాజరయ్యారు. అయితే ఈ దంపతులు మధ్య గత కొన్నేళ్లుగా విడాకులు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పార్టీ సమావేశానికి హాజరైన వీరు ఏదో విషయం గురించి గొడవపడ్డారు. అది కాస్తా ముదిరి చేయి చేసుకునే వరకు వెళ్లింది.

Related Posts

Leave a Comment