మరో పదేళ్ళు సి.ఎం. గా నేనే : కేసీఆర్

by CNN TELUGU
0 comment

*అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు*

హైదరాబాద్, సెప్టెంబరు,15 : తనకు కొంతమంది మిత్రులున్నారని.. ‘కేసీఆర్ ఆరోగ్యం ఖతం అయిందట కదా.. అమెరికాకు పోతడట కద’ అని ప్రచారం చేశారని కేసీఆర్ చెప్పారు. 20 ఏళ్లుగా అదే ప్రచారం చేస్తున్నారని.. ఇరవై ఏళ్లయినా తాను చావలేదని కేసీఆర్ అసెంబ్లీలో చమత్కరించారు. ఇప్పుడు కూడా తనకు ఏం కాలేదని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు కూడా కేసీఆర్ దిగిపోయి.. కేటీఆర్‌ను సీఎంను చేస్తాడని కొందరు తన గురించి ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తానెందుకు కేటీఆర్‌ను సీఎంను చేస్తానని కేసీఆర్ ప్రశ్నించారు.

కనిష్టంగా మరో మూడు టర్మ్‌లు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉంటుందని, తన ఆరోగ్యం బాగుందని, మరో రెండు టర్మ్‌లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు తనకు 66 ఏళ్లని, ఇంకో పదేళ్లన్నా సీఎంగా చేయనా అని కేసీఆర్ స్పీకర్‌నుద్దేశించి వ్యాఖ్యానించడం విశేషం. ఎన్ని శాపాలు పెట్టినా గట్టిగానే ఉంటానని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Related Posts

Leave a Comment