భారత్ కి షాకిచ్చిన ట్రంప్ – ‘మధ్యవర్తిత్వం చేయగల సత్తా’ నాకుంది

by CNN TELUGU
0 comment

ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తామని ప్రకటించిన మరుసటి రోజే భారతీయులంతా అవాక్కయ్యేలా ట్రంప్‌ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

భారత్-అమెరికా స్వప్నాలను సాకారం చేసేందుకు కలిసి పనిచేస్తామని హోస్టన్‌లో జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమంలో చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే తన మాట మార్చారు. అమెరికాలో భారత ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది.

అయితే… ఆదివారం మోదీతో పాటు హోస్టన్ సభలో పాల్గొన్న ట్రంప్…ఆ మరుసటి రోజే పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశమై భారత్‌‌తో పాటు.. ప్రధాని మోదీకి నివ్వేరపరిచి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ నోట మళ్లీ కశ్మీర్‌ అంశం చర్చకు వచ్చింది.

కశ్మీర్‌ అంశం చాలా సంక్లిష్టమైందని.. ఈ విషయంలో భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేయగల సమర్థత, సత్తా తనకుందని భారత్‌, పాక్‌లు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Related Posts

Leave a Comment