పేపర్ లీకులతో మాకు సంబంధం లేదు..

by CNN TELUGU
0 comment

గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష పత్రాల తయారీతో పాటు ప్రింటింగ్ వ్యవహారాలను పంచాయతీ రాజ్ శాఖే నిర్వహించిందని.. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఉదయ్‌భాస్కర్‌ తేల్చిచెప్పారు.

గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షలు తమ పరిధిలో లేని అంశమని, అలాగే తాము నిర్వహించని పరీక్షలపై సమాధానం చెప్పలేమని దీనికి.. ఏపీపీఎస్సీకి సంబంధం లేదని ఆ సంస్థ చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. పరీక్షలను పంచాయతీరాజ్‌శాఖ నిర్వహించిందని, అలాగే పరీక్ష పత్రాల తయారీతో పాటు ప్రింటింగ్ వ్యవహారాలను పంచాయతీ రాజ్ శాఖే నిర్వహించిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

అలాగే పరీక్షల పేపర్ లీకయిందో లేదో తనకు తెలియదని, పంచాయతీరాజ్ శాఖనే అడగండని ఉదయభాస్కర్ చెప్పారు. తమ సంస్థలో అనేక అంశాలు గోప్యంగా ఉంచుతామని, ఏపీపీఎస్సీ సతంత్రత కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థ అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, ప్రభుత్వం పరీక్షలపై తమ నుంచి ఎలాంటి నివేదిక కోరలేదని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌భాస్కర్‌ తేల్చిచెప్పారు.

Related Posts