తెలుగుదేశం పార్టీని మూసేస్తారా : మంత్రి అనిల్ చాలెంజ్..!

by CNN TELUGU
0 comment
అమరావతి సెప్టెంబరు, 24 : ఒక వైపు ఏపి సీయం జగన్ రాష్ట్ర అభివృద్ధికోసం నిరంతరంగా కష్ట పడుతుంటే రాష్ట్ర అభివృద్దిని ఓర్చుకోలేని చంద్రబాబు అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
పోలవరం ప్రాజెక్టు పనులను నవంబర్ నుంచి ప్రారంభిస్తామని పదేపదే చెప్తున్నా పనులు నిలిపివేశారంటూ చంద్రబాబు నాయుడు గగ్గోలు పెట్టడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కమిషన్లు కోసమే పనిచేసిందని ఆరోపించారు. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసేంందుకు ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.780 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే విధంగా సీఎం వైయస్ జగన్ ముందుకు వెళ్తుంటే దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తు న్నారంటూ మండిపడ్డారు. 

రివర్స్ టెండరింగ్ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అవినీతి బండారం బయటపడుతుందన్న ఆందోళనతో లేనిపోని హంగామా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ ను నిర్వహిస్తుంటే దానిపై అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్. రాబోయే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేకపోతే టీడీపీని మూసివేస్తారా అంటూ సవాల్ విసిరారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

మీరు మాటల మనిషని, మీలా మాట్లాడటం మా వల్ల కాకపోవచ్చూ కాని పనులు చేస్తానని చెప్పి నమ్మించడం మావల్ల కాదు.ఇప్పటికైన కపట రాజకీయాలు కట్టి పెట్టండని ఘాటూగా వ్యాఖ్యానించారు..

Related Posts