జగన్… దీనికి సమాధానం చెప్పాలి.. పవన్

by CNN TELUGU
0 comment

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీలో పనిచేసే కొందరి బంధువులకు తాజాగా ప్రకటించిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాల్లో టాప్ ర్యాంక్‌లు వచ్చాయి. దీంతో పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం తరఫున మంత్రులు స్పందించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే, తట్టుకోలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.

‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీక్ అయిందనే ప్రచారం ఆందోళన కలిగిస్తుంది. వ్యవస్థ మమ్మల్ని మోసం చేసిందని యువత భావించకూడదు. తమ జీవితాలు మారతాయని, వారు చాలా పెద్ద నమ్మకంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. కానీ, నేతల అండ ఉన్నవారికే జాబ్స్ దొరుకుతాయనే అభిప్రాయం వారిలో రాకూడదు. ప్రభుత్వం చెబుతున్న పారదర్శకత కేవలం మాటల్లో కాదు వాస్తవంలో ఉండాలి. పేపర్ లీక్ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించాలి.’ అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

Related Posts