హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. ఉస్మానియా వైద్యులు సుమారు రెండు గంటలపాటు దీన్ని నిర్వహించారు. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియను పోలీసులు వీడియో రికార్డు చేశారు. అలాగే కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించగా, ఆయన చెవుల దగ్గర నుంచి గొంతు మీదగా ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. పోస్ట్‌మార్టం పూర్తికావడంతో కోడెల పార్థివ దేహాన్ని బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించనున్నారు.
previous post