కోడెల కేసుపై సీబీఐ అవసరం లేదు : హైకోర్టు

by CNN TELUGU
0 comment
హైదరాబాద్ : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కేసుపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పిటిషన్‌లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బంజారాహిల్స్ పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. ‘‘కోడెల ఆత్మహత్య కేసు విచారణ కొనసాగుతోంది. కోడెల కుటుంబ  సభ్యుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంది. ఈ కేసులో ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో కోడెలది ఆత్మహత్యగా తేలింది. పిటిషన్ వేసిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదు’’ అని బంజారాహిల్స్ పోలీసులు పేర్కొన్నారు.

Related Posts