కొడుకులా అండగా ఉంటా : నారా లోకేశ్

by CNN TELUGU
0 comment

గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన క్రిష్ణకిశోర్ కుటుంబానికి భరోసానిచ్చిన నారా లోకేశ్
తక్షణసాయంగా 25వేల రూపాయలు అందజేత

గుంటూరు, సెప్టెంబరు,16 : “కోల్పోయిన చెట్టంత కొడుకును తెచ్చివ్వలేను.. మీ కొడుకులాగే అండగా ఉంటాను” అని నారా లోకేశ్ శోకసంద్రంలో ఉన్న కుటుంబానికి భరోసానిచ్చారు. తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన మండపాక క్రిష్ణకిశోర్ గోదావరిలో బోటు మునిగిన ప్రమాదంలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం నులకపేటలో మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టంపై బతుకుతోంది. పెద్ద కొడుకు క్రిష్ణకిశోర్ ఇటీవలే ఉద్యోగంలో చేరాడు. ఇక తమకు అన్నీ మంచి రోజులే అని సంతోషిస్తున్న ఆ కుటుంబానికి గోదావరిలో బోటు ప్రమాదం కారుచీకట్లే మిగిల్చింది. ఇంటికి చేదోడువాదోడుగా ఉంటున్న చెట్టంత కొడుకు ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచి తరలిరాని తీరాలకు చేరాడు. మృతుని కుటుంబసభ్యులను పరామర్శించిన నారా లోకేశ్ అధైర్యపడొద్దని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తక్షణసాయంగా 25 వేల రూపాయలు అందజేశారు. కుటుంబాన్ని పరామర్శించిన వారిలో తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, టీడీపీ సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావులున్నారు.

Related Posts

Leave a Comment