కేసీఆర్‌ అంతు చూస్తాం..

by CNN TELUGU
0 comment

పరకాల: కేసీఆర్‌ మొదటి సారి మరియు రెండో సారి మంత్రి వర్గ విస్తరణలో మాదిగలకు చోటు ఇవ్వకపోవడం చూస్తేంటే మాదిగల అణిచివేత కుట్ర జరుగుతోందని మాదిగల అంతు చూడాలని చూస్తే సీఎం కేసీఆర్‌ అంతు చూస్తామని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు.

పరకాల పట్టణంలోని అమరధామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ…హన్మకొండలోని కేడీసీ మైదానంలో ఈ నెల 22న చేపట్టబోయే మహా దీక్షతో యావత్తు ప్రపంచానికి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తామన్నారు. కేసీఆర్‌, 1 శాతం ఉన్న వెలమలకు 4 మంత్రి పదవులు, 4 శాతం ఉన్న రెడ్డిలకు 6 మంత్రి పదవులు, 12 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో పరకాల అధికార ప్రతినిధి దుప్పటి మొగిళి, ఎంఎస్‌ఎఫ్‌ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ముక్కెర ముఖేష్‌ మాదిగ, మాదిగ యువసేన రాష్ట్ర కన్వీనర్‌ పుట్ట భిక్షపతి మాదిగ పాల్గొన్నారు.

Related Posts

Leave a Comment