ఎంపీ రఘురామ ఢిల్లీ పయనం ..

by CNN TELUGU
0 comment

సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రి నుంచి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు బుధవారం డిశ్చార్చ్ అయ్యారు. వెంట‌నే బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ప్రత్యక విమానంలో బ‌య‌లుదేరి వెళ్ళారు. ర‌ఘురామ కాళ్లనొప్పితో పాటు ప‌లు ఆరోగ్య స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఢిల్లీలో ఆయ‌న‌ మెరుగైన వైద్య చికిత్స తీసుకోనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించార‌నే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు కొన్ని రోజుల క్రితం రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రిలో ఆయ‌న‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు సుప్రీంకోర్టు ఇటీవ‌ల‌ ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Related Posts

Leave a Comment