‘ఉల్లి’ దుకాణాలపై విజిలెన్స్ దాడులు

by CNN TELUGU
0 comment

విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి గ్రామంలో ఉన్న మహాత్మాగాంధీ టోకు వ్యాపార కేంద్రంలోని ఉల్లిపాయల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు సోమవారం రాత్రి దాడి చేశారు.

ఉల్లిపాయలు అధికంగా నిల్వ ఉంచుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు. గోదాముల్లో నిల్వ ఉంచిన, అధిక ధరలకు అమ్మిన, సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు సహారా, హనుమంతరావు, ఎస్ఐ నబి సిబ్బంది మరియు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ పాల్గొన్నారు.

Related Posts