ఉద్యోగ నియామకాల్లో చరిత్ర సృష్టించిన జగన్ : పెద్దిరెడ్డి

by CNN TELUGU
0 comment

అమరావతి,సెప్టెంబర్,19 : గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్టపరచాలన్న ప్రధాన ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్టోబరు 2న ప్రారంభిస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పటిష్టంగా అమలు చేసి ప్రజలకు సౌకర్యవం తమైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలని పెద్దిరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌, మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌తో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముందుగా సచివాలయ ఉద్యోగుల రాతపరీక్ష లు పకడ్బందీగా నిర్వహించి ప్రభుత్వ ప్రతిష్టను పెంచినందుకు కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు.

నవరత్నాలు అమల్లో ఎలాంటి లోపాలు లేకుండా జరిగేలా సచివాలయ వ్యవస్థ పనిచేయాలన్నారు. మూడు నెలల పాలనలో ఏ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు సమ ర్థవంతంగా పనిచేసేలా చూడాలన్నారు. మండలానికి ఓ గ్రామ సచివాలయం, మున్సిపాలిటీకి ఒక వార్డు సచివాలయాన్ని అక్టోబరు 2న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. ఫర్నీచర్‌, కంప్యూటర్లు, స్కానర్‌లు తదితర అన్ని సౌకర్యాలతో గ్రామ, వార్డు సచివాలయాలు నవంబరు 15 నాటికి పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

Related Posts

Leave a Comment