ఆయనకు ముందస్తు ‘బెయిల్ మంజూరు’.. అజ్ఞాతం వీడతారా?

by CNN TELUGU
0 comment

ఎంపీడీవో కార్యాలయంలో చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారన్న అభియోగాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అజ్ఞాతంలోనే ఉన్న కూనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత, ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

కేసుల్లో చిక్కుకున్న కూన అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ నిర్వహించింది. అనంతరం కూన రవికుమార్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ హయాంలో కూన ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.

గత 28 రోజులుగా అజ్ఞాతలో వున్న రవికుమార్ ఈ కేసులో ఏ ఒన్ ముద్దాయి ఈ కేసులో మొత్తం 12 మందిపై గత నెల 27 వ తేదీన సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. ఇప్పటికే పది మందికి గత నెల 30 నే ఆమదాలవలస మునిసిభ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం బెయిల్ మంజూరు. ఈ కేసులో ఏ ఒన్ కూన రవికుమార్ తో పాటు ఏ 11 అంబళ్ల రాంబాబు కు కూడా బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Related Posts