ఆమె వెనక్కి తగ్గలేదు.. ‘అదో – నేనో’ తేల్చుకుంటా..!

by CNN TELUGU
0 comment

పోలీసులకు ఓ కాల్ వచ్చింది. అమెరికా… మిచిగాన్‌లో తమ కారు ఇంజిన్‌లో కొండ చిలువ ఉందని చెప్పారు కొందరు. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లారు. మహిళా ఆఫీసర్ ఫెట్టిగ్… కారు బానెట్ ఓపెన్ చేశారు. నాలిక బయటకు తెరుస్తూ.. లోపలకు తీసుకుంటూ.. ఓ కొండ చిలువ కనిపించింది.

జనరల్‌గా లేడీస్.. పాముల్ని చూడగానే ‘పాము.. పాము’ అంటూ.. కంగారు పడతారు. ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. కొండ చిలువో, నేనో తేల్చుకుంటా అన్నట్లుగా ముందుకు కదిలారు.

ఎప్పుడైనా కొండ చిలువను పట్టుకోవాలంటే.. ముందుగా.. దాని తలను కంట్రోల్ చెయ్యాలి. అందుకోసం తలను ముందుగా పట్టుకోవాలి. అలా చేస్తే… ఇక ఆ కొండ చిలువ.. అటూ ఇటూ కదల్లేక ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత దాని తోకను పట్టుకొని.. వెనక్కి లాగాలి. అప్పుడు అది దేనికీ చుట్టుకోకుండా.. ముఖ్యంగా మనకు చుట్టుకోకుండా తప్పించుకోగలం. ఐతే… ఆ మహిళా పోలీస్ ఆఫీసర్.. ఈ రూల్సేవీ పాటించలేదు. అది కొంచెం చిన్న పామే కావడంతో.. చటుక్కున దాని నడుం పట్టుకొని.. బాక్సులో వేసేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది షెల్బీ టౌన్‌షిప్ పోలీస్ విభాగం. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్సే వస్తోంది. టన్నుల కొద్దీ రియాక్షన్స్ వస్తున్నాయి. ఆమె చాలా ధైర్యవంతురాలని కొందరు అంటే.. మరో నెటిజన్ భయపడుతూ.. తన కారులో కొండ చిలువ ఉంటే.. తనకు హార్ట్ ఎటాక్ వచ్చేదని, మరో నెటిజన్ తాను ఉడుత, పిల్లిని కార్ ఇంజిన్‌లో చూశాననీ, కొండచిలువను చూడటం ఇదే మొదటిసారి అని నెటిజన్ స్పందించారు.

Related Posts