ఆధార్‌ తో మృతదేహం గుర్తింపు

by CNN TELUGU
0 comment

కేశంపేట/పాపిరెడ్డిగూడ : అక్కినేని నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో కనిపించిన మృతదేహం గుర్తించారు. జేబులో ఆధార్‌ కార్డు ఆధారంగా నాలుగేళ్లుగా కనిపించకుండా పోయిన పాపిరెడ్డిగూడకు చెందిన పాండు (32)ది అని తేలింది. అక్కడే అతడు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

పోలీసుల కధనం ప్రకారం చిన్న అంజయ్య జంగమ్మ దంపతుల నలుగురు సంతానంలో పాండు చిన్నవాడు. అవివాహితుడు. ఇష్టమైన మూడో అన్న కుమార్‌ అనారోగ్యంతో మృతిచెందిన నాటి నుంచి పాండు కుంగిపోయాడు. తనకు దేనిమీదా ఆశలేదని సోదరులకు చెప్పేవాడు. తరువాత ఓ లేఖ రాసి చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత పాండు కోసం కుటుంబసభ్యులు చాలాచోట్ల ప్రయత్నం చేసిన ఆచూకీ లభించలేదు. అతడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు.

రంగారెడ్డి జిల్లా పాపిరెడ్డిగూడలోని ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏళ్లుగా పనులేవీ జరగడం లేదు. వారం క్రితం ఆ వ్యవసాయ క్షేత్రానికి నాగార్జున సతీమణి అమల వెళ్లారు. సేంద్రియ పద్ధతిలో సాగు పనులు చేపట్టేందుకు కొందరిని ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం అక్కడికి కొందరు వ్యక్తులు వచ్చారు. అదే గ్రామానికి చెందిన బుద్దోలు శ్రీశైలం షెడ్డులోకి వెళ్లి చూడగా అస్థిపంజరం కనిపించింది. మృతదేహంపై దుస్తులు మాత్రమే మిగిలాయి. గురువారం శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌, షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ రామకృష్ణ పరిశీలించారు.

Related Posts

Leave a Comment