అన్ని అనుమతులతోనే నిర్మించాం: లింగమనేని

by CNN TELUGU
0 comment

అమరావతిటీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను లింగమనేని రమేష్ పేరుతో జారీ చేశారు. అయితే ఈ నోటీసుల వ్యవహారంపై లింగమనేని రమేష్ స్పందించారు. వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని సీఆర్డీఏ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ఫ్లోర్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఫస్ట్‌ఫ్లోర్‌లోని డ్రెసింగ్‌ రూమ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన లింగమనేని రమేష్.. ఇంటి నిర్మాణ సమయానికి సీఆర్డీఏ లేదని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించామని తెలిపారు. స్విమ్మింగ్‌పూల్‌కి రివర్‌ కన్సర్వేటర్‌ అనుమతి ఉందని లింగమనేని రమేష్‌ వెల్లడించారు.

Related Posts

Leave a Comment